Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాటింగ్ కోచ్ సంజరు బంగయ్
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్ జట్టు సెలక్షన్ దగ్గర్నుంచి, ప్రపంచకప్ మ్యాచుల వరకూ ఓ అంశంలో విమర్శలు పదేపదే వేలెత్తి చూపిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ శైలి, దూకుడుగా ఆడటంలో సానుకూల దృక్పథం కొరవడటం పట్ల సచిన్ టెండూల్కర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. అఫ్గాన్ మ్యాచ్‌లో విసిగించిన ధోని, తాజాగా ఇంగ్లాండ్‌పైనా అవసరం మేరకు ఆడలేదు. 31 బంతుల్లో 42 పరుగులే చేశాడు. . ధోని విమర్శలపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ' ధోనిపై వస్తున్న విమర్శలతో ఆశ్చర్యానికి గురయ్యాను. అతడు జట్టు కోసం ఆడుతున్నాడు. మహి ఆటపట్ల జట్టు సంతృప్తికరంగా ఉంది. అఫ్గాన్‌పై ఇన్నింగ్స్ మినహా మహి ప్రతిసారీ తన బాధ్యత నిర్వర్తించాడు. ఏడు మ్యాచుల్లో ఐదు సార్లు ధోని బాధ్యతతో ఆడాడు' అని బంగర్ పేర్కొన్నాడు.