Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా
ముంబయి : పరుగుల యంత్రం, రికార్డుల వేటగాడు విరాట్ కోహ్లిపై క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పొగడ్తల వర్షం కురిపించాడు. నవీ ముంబయిలోని డివై పాటిల్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకున్న విండీస్ మాజీ స్టార్.. భారత కెప్టెన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' విరాట్ కోహ్లి పరుగుల యంత్రం. కానీ నా ఓటు మాత్రం సచిన్ టెండూల్కర్‌కే. క్రికెట్లో కోహ్లికి, మిగతా ప్రపంచ ఆటగాళ్లకు ఎంతో గ్యాప్ ఉంది. కానీ టీ20, టీ20, 100 బాల్స్, వన్డే, టెస్టులు ఇలా ఏ ఫార్మాట్లోనైనా బ్యాటింగ్ చేయాలని అందరూ కోరుకునే ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లి. విదేశీ గడ్డపై భారత్ ఇప్పుడు గొప్పగా ఆడుతోంది. అంద.ుకు కారణం సచిన్. ఆ రోజుల్లో ఉపఖండం దాటి వస్తే భారత బ్యాట్స్‌మెన్ తేలిపోయేవారు. సచిన్ ఒక్కడే అన్ని పిచ్‌లపై చెలరేగాడు. భారత జట్టు సచిన్ క్రికెట్ పుస్తకంలోని విదేశీ పేజీని కొట్టేసినట్టు ఉంది. అందుకే విదేశీ పర్యటనల్లో అందరూ మెరుగ్గా ఆడు తున్నారు' అని లారా అన్నాడు.