Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంగ్లాండ్ యంగ్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ప్రపంచకప్‌లో బౌన్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్చర్ బౌన్సర్‌తో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా మైదానాన్ని వీడాడు. ఆ బౌన్సర్‌తో కండ్లు బైర్లు కమ్మాయని, తర్వాతి రెండు మ్యాచులకు దూరమైన ఆమ్లా అన్నాడు. తాజాగా సెమీస్‌లో ఆర్చర్ బౌన్సర్‌కు ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ నెత్తురోడాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి బంతికి అలెక్స్ గాయపడ్డాడు. బౌన్సర్ ధాటికి హెల్మెట్ కిందపడగా.. దవడ నుంచి రక్త స్రావం జరిగింది. వైద్య సహాయం అనంతరం అలెక్స్ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు.