Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్ వివాదంపై ఏబీ
జొహనెస్‌బర్గ్ : దక్షిణా ఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం, ఏడాది క్రితం వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్ ప్రపంచకప్‌లో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నాడని, సెలక్షన్ కమిటీ అతడికి మొండిచేయి చూపించిందనే వార్తలు గుప్పుమన్నాయి.ప్రపంచకప్ నుంచి సఫారీ నిష్క్రమించిన తర్వాత డివిలియర్స్ ఈ వివాదంపై స్పందించాడు. ఈ మేరకు అతడు ఓ ప్రకటన విడుదల చేశాడు. ' నేను ఎటువంటి డిమాండ్లు చేయలేదు. ప్రపంచకప్ జట్టులో ఉండాలని ఎటువంటి బలవంతం చేయలేదు. ఎంపిక చేస్తారని సైతం అనుకోలేదు. నా వైపు నుంచి ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ నాకు అన్యాయం జరిగిందనే సంగతే ఉత్పన్నం కాదు. కెప్టెన్ డుప్లెసిస్‌తో నాకు స్కూల్ రోజుల నుంచి మంచి స్నేహం ఉంది. అతడితో ఓ సారి మాట్లాడుతుండగా, ప్రపంచకప్‌లో నా అవసరం ఉందనిపిస్తే నేను అందుబాటులో ఉన్నానని చెప్పాను. ఐపీఎల్ సందర్భంగా డుప్లెసిస్‌తో ఈ విషయాన్ని ప్రస్తావించాను. డుప్లెసిస్‌తో నేను చేసిన వ్యక్తిగత సందేశాలు బయటకు లీకయ్యాను. నేను స్వార్థపూరితంగా ఎంచుకున్న టోర్నీల్లోనే ఆడుతున్నాననే ముద్ర వేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం.దక్షిణాఫ్రికా క్రికెట్ తర్వాతి తరానికి మార్గదర్శనం చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను' అని డివిలియర్స్ ప్రకటనలో తెలిపాడు.