Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
- న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఎవరు నెగ్గినా చరిత్రే
- హాట్ ఫేవరైెట్గా ఆతిథ్య మోర్గాన్ సేన
- విలియమ్సన్ అండతో కివీస్ ఆశలు
- ప్రపంచకప్ ఫైనల్ పోరు నేడు
ఆరు వారాలు, 47 మ్యాచులు. పది జట్ల సమరం నాలుగు జట్లకు చేరగా.. తాజాగా రెండు జట్లే మిగిలాయి. ఇప్పటివరకూ ప్రపంచకప్ విజయం రుచి ఎరుగని ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టైటిల్ పోరులో నిలిచాయి. నేడు లార్డ్స్ ఫైనల్లో ఎవరు గెలిచినా క్రికెట్ ప్రపంచకప్‌కు కొత్త చాంపియన్ రాబోతుంది. క్రికెట్ ప్రపంచకప్ ముఖచిత్రం సైతం మారిపోనుంది.
సొంత అభిమానుల అండ, పటిష్టమైన పేస్ బలం. విధ్వంసక బ్యాట్స్‌మెన్ వీరోచిత విన్యాసాలు. నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడుతున్న ఇంగ్లాండ్, నేడు లార్డ్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
సమర్థవంతమైన నాయకుడు, బలమైన మిడిల్ ఆర్డర్, పదునైన పేస్‌తో న్యూజిలాండ్ సైతం తొలి ప్రపంచకప్‌పై కన్నేసింది. మాంచెస్టర్‌లో భారత అభిమానులను నైరాశ్యంలో ముంచినట్టే, లార్డ్స్‌లో ఇంగ్లీష్ జట్టునూ శోకసంద్రంలో ముంచేందుకు కివీస్ రంగం సిద్ధం చేసుకుంది.
ప్రపంచకప్ ముఖాముఖి పోరులో న్యూజిలాండ్‌పై పైచేయి సాధించిన ఇంగ్లాండ్.. నేడు ఫైనల్లోనూ అదే ప్రదర్శనపై ఆశలు పెంచుకుంది. 2015 రన్నరప్ ప్రదర్శనను 2019లో మెరుగుపర్చుకోవాలని కివీస్ ఎదురుచూస్తుండగా.. నాల్గో ప్రయత్నంలోనైనా ప్రపంచకప్‌పై ఇంగ్లీష్ ముద్దు పెట్టాలని ఇంగ్లాండ్ ఆశపడుతోంది. అన్ని విభాగాల్లోనూ లోపం లేని జట్టుగా కనిపిస్తోన్న ఇంగ్లాండ్ ఫైనల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. లార్డ్స్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చారిత్రక టైటిల్ పోరు నేడు.
లార్డ్స్ (లండన్): తొలి ఐదు ప్రపంచకప్‌లలోనే మూడు సార్లు ఫైనల్లో ప్రవేశం. 1979, 1987, 1992 ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించినా ఇంగ్లాండ్ కప్పును కౌగిలించుకోలేదు. 1987లో కప్పుకు చేరువగా వచ్చినా.. కంగారూ దెబ్బకు మళ్లీ దూరమైంది. సొంత గడ్డపై వరల్డ్ నం.1 జట్టుగా టైటిల్ పోరులో ఆడుతున్న ఇంగ్లీష్ జట్టు నేడు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 12 ప్రపంచకప్‌లో ఏకంగా 8 సార్లు సెమీఫైనల్స్‌కు చేరుకుని తిరుగులేని నిలకడ చాటిన న్యూజిలాండ్.. వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. సహా ఆతిథ్య దేశంగా 2015 టైటిల్ పోరులో పొరుగు దేశం ఆస్ట్రేలియాకు కప్పు కోల్పోయింది. లార్డ్స్‌లో మెల్బోర్న్కు మించిన ప్రదర్శన చేయాలని విలియమ్సన్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. సెమీస్‌లో భారత్ ఓడించిన అనుభవంతో కివీస్‌ను మోర్గాన్ సేన అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
ధనాధన్‌కు పెట్టింది పేరు : గత రెండేండ్లలో వన్డే క్రికెట్లో ఇంగ్లాండ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వన్డేల్లో పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనే ధనాధన్ చూసేవాళ్లం. కానీ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ తొలి బంతి నుంచీ ఆఖరు బంతి వరకూ బాదటమే పనిగా పెట్టుకుంది. ఇంగ్లాండ్ ధనాధన్ వ్యూహానికి నాయకత్వం వహిస్తున్న ఓపెనర్ జేసన్ రారు నేడు ఫైనల్లో కీలకం. గ్రూప్ దశలో రారు ఉండగా ఇంగ్లాండ్ అలవోక విజయాలు సాధించింది. గాయంతో జట్టుకు దూరం కాగానే, పేలవ ప్రదర్శనతో నాకౌట్ స్థానం ప్రశ్నార్థకం చేసుకుంది. చివర్లో మళ్లీ రారు వచ్చాడు, ఇంగ్లాండ్ మళ్లీ గాడిలో పడింది. జేసన్ రారు గత మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు. రారు అర్ధ సెంచరీలతో మెరుస్తున్నాడు. పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడే రారు, ప్రత్యర్థి ప్రణాళికలను చిత్తు చేయగలడు. రారు క్రీజులో ఉండగా రన్‌రేట్ 7కు తగ్గదు. స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ విపత్కర పరిస్థితుల్లో బాధ్యతగా ఆడగలడు, బాదాల్సిన వేళ దండెత్తగలడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సెమీస్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. మోర్గాన్, జోశ్ బట్లర్ కనీసం అర్థ సెంచరీలు బాదితే.. ఇంగ్లాండ్ విజయానికి తిరుగుండదు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయగల సత్తా ఉన్నా మోర్గాన్, బట్లర్ అత్యంత ప్రమాదకరం. ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. టాప్-4 బ్యాట్స్‌మన్ విఫలమైనా.. ఇన్నింగ్స్‌ను లాగించగల సత్తా ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ సొంతం. అందుకే ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. బంతితో జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్ వికెట్ల వేటలో దూసుకుపోతున్నారు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ అవసరం ఇంగ్లాండ్‌కు పెద్దగా రాకపోవచ్చు. పచ్చిక పిచ్ నేపథ్యంలో మోయిన్ అలీకి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు.
ఆ ఇద్దరే కీలకం : ఇంగ్లాండ్ ఫైనల్స్‌కు రావటం ఊహించనదే కానీ, న్యూజిలాండ్ టైటిల్ పోరులో నిలిచే ప్రదర్శన చేయలేదనేది ఎక్కువ మంది అభిప్రాయం!. అందుకు కారణం లేకపోలేదు. టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఏ దశలో మెరువలేదు. కేవలం ఇద్దరి ప్రదర్శనపైనే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ ఆధారపడింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ మెరుపులతోనే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నడుస్తోంది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్ నిలకడగా విఫలమవుతున్నారు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ సైతం ఓపెనర్ల బాటలోనే నడుస్తున్నాడు. ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హౌమ్ ఫర్వాలేదు. ఫైనల్లోనూ కివీస్ ఆ ఇద్దరిపైనే ఆధారపడితే కప్పు అందుకోవటం అసాధ్యమనే చెప్పాలి!. తుది జట్టులో చోటు ఇచ్చినందుకు మార్టిన్ గప్టిల్ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. విలియమ్సన్, టేలర్లు కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఒత్తిడితో కూడుకున్న ఫైనల్లో స్వల్ప స్కోర్లు నమోదైతే ఈ ఇద్దరు కీలకం అవుతారు. విలియమ్సన్, టేలర్‌ను వేగంగా వెనక్కి పంపితే ఇంగ్లాండ్ ముందుగానే సంబురాలు చేసుకోవచ్చు!. బంతితో ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్, మాట్ హెన్రీలు ఇంగ్లాండ్ పేస్ దళానికి సమవుజ్జీలు. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ను పవర్ ప్లేలో రారు, బెయిర్‌స్టోపై ప్రయోగించే అవకాశం ఎక్కువ. ఒక్క మ్యాచ్‌లోనూ సమష్టి ప్రదర్శన చేయని న్యూజిలాండ్.. లార్డ్స్లోనైనా ఆ పని చేస్తుందేమో చూడాలి. జట్టుగా ఆడితే న్యూజిలాండ్ విజేతగా నిలిచేందుకు అవకాశం ఉంది.
పిచ్ రిపోర్టు : ప్రపంచకప్ ఫైనల్స్‌కు లార్డ్స్‌లో కొత్త పిచ్‌ను సిద్ధం చేశారు. లార్డ్స్ పిచ్ బంతికి, బ్యాట్‌కు సమాన అవకాశాలు ఇస్తుంది. ప్రస్తుతం పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది. సీమర్లకు మంచి అనుకూలత లభించవచ్చు. గ్రూప్ దశలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లార్డ్స్‌లో ఓ మ్యాచ్ ఆడాయి. రెండు జట్లూ ఆస్ట్రేలియా చేతిలో భారీ పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. 260-280 పరుగులు చేయగల్గితే లార్డ్స్‌లో ప్రపంచకప్ ట్రోఫీ ముద్దాడవచ్చు!. టైటిల్ పోరుకు వర్షం ముప్పు లేదు.
తుది జట్లు (అంచనా) :
ఇంగ్లాండ్ : జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, క్రిస్ వోక్స్, లియాం ఫ్లంకెట్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమ్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్.