Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేందర్కు మరో నాకౌట్
ఇస్తాంబుల్/న్యూయార్క్ : బాక్సింగ్, రెజ్లింగ్‌లో భారత్‌కు ఆదివారం చెప్పుకోదగిన విజయాలు లభించాయి. ప్రొ బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ యు.ఎస్ ప్రొఫెషనల్ సర్క్యూట్ అరంగేట్రంలోనే అదిరే విజయం సాధించాడు. సీనియర్ బాక్సర్ మైక్ స్నిడర్ను నాకౌట్ చేసి కెరీర్ రికార్డును 11-0తో మెరుగుపర్చుకున్నాడు. మూడో రౌండ్లో స్నిడర్పై పిడి గుద్దుల వర్షం కురిపించిన విజేందర్ ప్రత్యర్థిని నాకౌట్ చేశాడు. ఏడాది విరామం తర్వాత విజేందర్ సింగ్ పోటీపడిన తొలి ఫైట్ ఇదే. మరోవైపు ఇస్తాంబుల్‌లో వినేశ్ ఫోగట్ పసిడి పట్టు పట్టేసింది. 53 కేజీల విభాగంలో వినేశ్‌కు ఇది వరుసగా రెండో స్వర్ణం. గత వారం మాడ్రిడ్‌లో పసిడి సాధించిన వినేశ్.. తాజాగా రష్యా రెజ్లర్ ఎకర్తినాపై 9-5తో స్పష్టమైన విజయం సాధించింది. ఫైనల్స్ దారిలో రెండు మ్యాచుల్లో టెక్నికల్ ఆధిపత్యంతో పైచేయి సాధించిన వినేశ్.. ఫైనల్లో అదరగొట్టింది. సీమ (50), మంజు (59) సైతం స్వర్ణాలు సాధించారు. సాక్షి మాలిక్ మెడల్ రౌండ్‌కు చేరలేదు.