Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ షూటింగ్ వరల్డ్కప్
న్యూఢిల్లీ : జర్మనీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో భారత షూటర్లు స్వర్ణాల పంట పండిస్తున్నారు. పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో అనీష్ భన్వాలా బంగారు పతకం గెలుపొందాడు. 29మంది షూటర్లు పాల్గొన్న అర్హత రౌండ్లోనూ భన్వాలా 584 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. భన్వాలాతోపాటు ఆదర్శ్సింగ్, ఆగేయ కౌషిక్, నాలుగు, ఆరోస్థానాల్లో నిలిచారు. రష్యాకు చెందిన ఇస్మకోవ్కు రజితం, జర్మనీకి చెందిన పీటర్కు కాంస్య పతకాలు దక్కాయి. దీంతో ఈ పోటీల్లో భారత్ 8 స్వర్ణ, 8 రజిత, 4 కాంస్య పతకాలను గెల్చుకున్నట్లయ్యింది.