Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్‌కప్ విన్నింగ్ కోచ్‌తో ఒప్పందం
హైదరాబాద్ : 44 ఏండ్ల ఇంగ్లాండ్ ప్రపంచకప్ కల సాకారం చేసిన కోచ్ ట్రెవర్ బేలిస్ వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ అధికారికంగా వెల్లడించింది. కోల్‌కత నైట్‌రైడర్స్ కోచ్‌గా ట్రెవరి రెండు సార్లు కెకెఆర్‌ను విజేతగా నిలిపాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ సిడ్నీ సిక్సర్‌ను విజేతగా నిలిపాడు. 2011లో శ్రీలంక వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరిన సమయంలో అతడే లంక చీఫ్ కోచ్. బేలిస్ హయాంలో ఇంగ్లాండ్ 3-2తో యాషెస్, 2016 వరల్డ్ టీ20 ఫైనల్స్, వరల్డ్ నం.1 వన్డే ర్యాంక్ సాధించింది. ఏడు సీజన్లలో ఐదు సార్లు సన్‌రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన టామ్ మూడీపై వేటు వేయలేదు. సన్‌రైజర్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లగల కోచ్‌గా కావాలని కోరుకున్నామని సన్‌రైజర్స్ తెలిపింది. ట్రెవర్ కోసం హైదరాబాద్ సహా కోల్‌కత నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ సంప్రదింపులు జరిపాయి. సన్‌రైజర్స్ 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచింది.