Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రస్థానంలోనే బెల్జియం
పారిస్ : ఫుట్‌బాల్‌లో టీమ్ ఇండియా పురోగతి ఓ అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఫిఫా చరిత్రలో 97వ ర్యాంక్‌తో అత్యుత్తమ స్థానం అందుకున్న తర్వాత భారత ఫుట్‌బాల్ జట్టు ముందుకు సాగటం లేదు. ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కోల్పోతూ 103కు వచ్చేసింది. జులై ఆరంభంలో 101గా ఉన్న భారత్ ర్యాంక్, జులై చివర్లో 103కు పడిపోయింది. కోపా అమెరికా కప్‌ను తొమ్మిదోసారి దక్కించుకున్న ఆతిథ్య బ్రెజిల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. వరల్డ్ చాంపియన్ ఫ్రాన్స్ మూడో స్థానానికి పడిపోయింది. బెల్జియం అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇంగ్లాండ్, ఉరుగ్వే టాప్-5లో కొనసాగుతున్నాయి. అర్జెంటీనా పదో ర్యాంక్‌లో నిలిచింది. జర్మనీ నాలుగు స్థానాలో కోల్పోయి 15, ఇటలీ 16వ స్థానాల్లో ఉన్నాయి. ఆఫ్రికా నేషన్స్ కప్‌ను అందుకున్న అల్జీరియా ఫిఫా చరిత్రలో అత్యుత్తమ 40వ ర్యాంక్ సాధించింది. ఆఫ్రికా సాకర్ స్టార్ జట్లు సెనెగల్, ట్యునిషియా, నైజీరియాలను ఓడించిన అల్జీరియా 28 స్థానాలు ఎగబాకింది.