Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో 38కే ఢమాల్
లార్డ్స్ : ప్రపంచ విజేత ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే ఆలౌట్ చేసి సంచలనం సృష్టించిన ఐర్లాండ్, టెస్టు అరంగేట్రం లోనే విజయం సాధించాలనే స్వప్నం భగమైంది. 182 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఐర్లాండ్ 11/0తో ఆశాజనకంగా ఛేదన మొదలెట్టింది. ఇంగ్లాండ్ సీమర్లు క్రిస్ వోక్స్ (6/17), స్టువర్ట్ బ్రాడ్ (4/19) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగారు. 15.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. 143 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ఏకైక టెస్టులో గెలుపొందింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నిం గ్స్‌లో 85 పరుగులకే కుప్పకూలినా.. రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసింది. లీచ్ (92), రారు (72) అర్ధ సెంచరీలతో మెరిశారు. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసింది. ఐర్లాండ్‌పై టెస్టు విజయంతో ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ ఆరంభించబోతుంది.