Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలకు బలమైన గాయాలు
బ్యూనోస్ ఎయిరిస్ : బాక్సింగ్ రింగ్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు బాక్సర్లు ప్రాణాలు కోల్పోయారు. రష్యా బాక్సర్ మాక్సిమ్ దాదాసేవ్ యు.ఎస్‌లో ఫైట్ చేస్తూ కుప్పకూలిన రెండు రోజుల్లోనే, అర్జెంటీనా బాక్సర్ బాక్సింగ్ రింగ్‌లో కుప్పకూలాడు. 23 ఏండ్ల హ్యూగో సంటాలిన్ గురువారం ఉరుగ్వే బాక్సర్ అబ్రూతో పోటీపడ్డాడు. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యూబిసి) టైటిల్ కోసం అబ్రూతో పది రౌండ్లు పోరాడిన సాంటలిన్ పోరును డ్రా చేసుకున్నాడు. ఫైట్‌లో మెరుగ్గానే కనిపించిన సాంటలిన్ ఫలితం ప్రకటించే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. హాస్పిటల్లో చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. తలకు తగిలిన బలమైన గాయాలతో మెదడు వాచిపోయి, కోమాలోకి వెళ్లాడు. ఐదు వారాల క్రితం జర్మనీ బాక్సర్తోనూ సాంటలిన్ పది రౌండ్లు పోటీపడ్డాడు. 2015లో ప్రొ బాక్సర్‌గా మారిన హ్యూగో 29 ఫైట్లలో 19 విజయాలు సాధించాడు.