Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ ఓపెన్ టైటిల్ సొంతం
నవతెలంగాణ, హైదరాబాద్ : సౌరభ్ వర్మ హైదరాబాద్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 21-13, 14-21, 21-16తో సింగపూర్ షట్లర్‌పై గెలుపొందాడు. 2019లో డబ్ల్యూబీఎఫ్ టూర్ టైటిల్ సాధించిన రెండో భారత షట్లర్‌గా నిలిచాడు. సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ నెగ్గిగా.. మరో భారత షట్లర్ ఈ సీజన్లో టైటిల్ సాధించలేదు. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన వర్మ రెండో గేమ్‌లో చతికిల పడ్డాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పోటీ ఎదురైనా హైదరాబాద్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచాడు. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంటకు భంగపాటు ఎదురైంది. అన్‌సీడెడ్ కొరియా జోడీ చేతిలో 17-21, 17-21తో సిక్కి, అశ్విని జంట అనూహ్య పరాజయం చవిచూసింది.