Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : కెరీర్ వన్డే మ్యాచ్ సంఖ్య 301తో ప్రత్యేక జెర్సీ, మైదానంలో అభిమానుల స్టాండింగ్ ఓవేషన్, ప్రత్యర్థి ఆటగాళ్ల అభినందనలు, డ్రెస్సింగ్‌రూమ్‌లో గార్డ్ ఆఫ్ హానర్, ఇన్నింగ్స్ ముగిశాక బ్యాట్‌పై హెల్మెట్‌పై స్పెషల్ అభివాదం.. ఇదీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వన్డేలో క్రిస్ గేల్ చట్టూ జరిగిన కథ. ప్రపంచకప్‌లో వీడ్కోలు ఆలోచనకు స్వస్తి పలికిన క్రిస్ గేల్, భారత్‌తో సిరీస్ ఆఖరు అని గతంలో వ్యాఖ్యానించాడు. దీంతో భారత్‌తో మూడో వన్డేలో క్రిస్ గేల్ కెరీర్ ముగిసిందని అందరూ భావించారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా కాన్ఫరెన్స్‌లో గేల్‌కు వీడ్కోలు అభినందనలు సైతం తెలిపాడు. ఇంత జరిగిన తర్వాత.. క్రిస్ గేల్ చిన్నగా అసలు విషయం బయట పెట్టాడు. నా కథ ముగియలేదు, నేను ఇంకా విండీస్ క్రికెట్లో కొనసాగుతున్నానని ప్రకటించాడు. ' నేను వీడ్కోలు ప్రకటన చేయలేదు. తదుపరి నోటీసు వచ్చే వరకూ నేను వెస్టిండీస్ క్రికెట్‌తోనే కొనసాగుతున్నట్టు' అని విండీస్ క్రికెట్ బోర్డు ట్టిట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో గేల్ పేర్కొన్నాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు క్రిస్ గేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. మరి, గేల్ జిగేల్ కథకు ఎప్పుడు ముగింపు పలుకుతాడో చూడాలి!.