Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో కరుణరత్నె శతకం
- సిరీస్‌లో 1-0 ఆధిక్యం
గాలె (శ్రీలంక) : 2019 వరల్డ్‌కప్ రన్నరప్, మంచి ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ను శ్రీలంక చిత్తు చేసింది. పదునైన టర్న్ లభించే గాలె పిచ్‌పై ఐదో రోజు 268 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించిన శ్రీలంక గాలె టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో కెప్టెన్ దిముత్ కరుణరత్నె (122, 243 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా.. లహిరు తిరిమానె (64) రాణించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 161 పరుగులు జోడించి విజయానికి గట్టి పునాది వేశారు. ఎంజెలో మాథ్యూస్ (28), కుశాల్ పెరీరా (23) రాణించారు. కెప్టెన్ కరుణరత్నె 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 249 పరుగులే చేయగా.. శ్రీలంక 267 పరుగులు చేసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 268/4తో ఘన విజయం ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0, 4) రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యం సాధించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో 60 పాయింట్లు సొంతం చేసుకుంది.