Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిన్ డాన్‌పై మెరుపు విజయం
- సాయిప్రణీత్ సహా ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశం
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
బసెల్ (స్విట్జర్లాండ్)
కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించినా అర్జున అవార్డుకు సిఫారసు చేయలేదని బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేసిన స్టార్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు. ప్రతిభ కనబరిచినా గుర్తింపు దక్కలేదని ఆవేదన చెందిన ప్రణయ్ ప్రతాపం, ఆ కసిని కోర్టులో చూపించాడు!. ఐదు సార్లు వరల్డ్ చాంపియన్, చైనా దిగ్గజం లిన్ డాన్‌ను మూడు గేముల్లో మట్టికరిపించిన ప్రణరు ప్రతాపం చూపాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్ పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. వరల్డ్ నం.30 హెచ్.ఎస్ ప్రణరుకి లిన్ డాన్‌పై ఇది మూడో విజయం. 2015 ఫ్రెంచ్ ఓపెన్, 2018 ఇండోనేషియా ఓపెన్‌లోనూ చైనా దిగ్గజాన్ని ప్రణయ్ ప్రతాపం వణికించాడు. 62 నిమిషాల రెండో రౌండ్ పోరులో 1-2తో ఓడిన లిన్ డాన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ నుంచి నిష్క్రమించాడు. డాన్‌ను కొట్టి ఫామ్ అందుకున్న ప్రణరు నేడు ప్రీ క్వార్టర్స్‌లో కఠిన సవాల్ ఎదుర్కొనున్నాడు. వరల్డ్ నం.1 కెంటో మోమోట (జపాన్)తో ప్రణరు తలపడనున్నాడు. సాయిప్రణీత్ 21-16, 21-15తో అలవోక విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
ప్రణరు పంజా విసిరాడు! : ఇటీవల లయ కోల్పోయిన ప్రణరు తొలి రౌండ్లో ఇబ్బంది పడ్డాడు. ఫిన్లాండ్ ఆటగాడు హీనో చేతిలో తొలి గేమ్‌లో ఓడిపోయాడు. కానీ తర్వాతి రెండు గేముల్లో పుంజుకుని ముందంజ వేశాడు. ఈ పరిస్థితుల్లో లిన్ డాన్‌పై ప్రణరు విజయం ఎవ్వరూ ఊహించలేదు. తాజా ఫామ్, అవార్డు రాలేదని ఆవేదన పరంగా ప్రణయ్ ప్రతాపం ఈ స్థాయిలో ఆడతాడని అనుకోలేదు. కానీ అగ్రశ్రేణి షట్లర్లకు షాక్ ఇచ్చేందుకు ప్రణరు ఎప్పుడూ ముందుంటాడు. 62 నిమిషాల పోరులో ప్రణయ్ చెమట చిందించకుండా ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. తొలి గేమ్ విరామ సమయానికి 11-5తో ఆరు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన ప్రణరు అదే జోరు కొనసాగించాడు. లిన్ డాన్‌కు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. 21-11తో అలవోకగా తొలి గేమ్ సాధించాడు. కానీ రెండో గేమ్‌లో లిన్ డాన్ గర్జించాడు. క్లాస్ ఆట తీరుతో చకచకా పాయింట్లు సాధించాడు. 5-5 వరకూ పోటీనిచ్చిన ప్రణరు తర్వాత వెనుకబడ్డాడు. ద్వితీయార్థంలోనూ లిన్ డాన్‌ను ప్రణరు అందుకోలేకపోయాడు. లిన్ డాన్ ఫామ్‌లోకి రాగా, నిర్ణయాత్మక గేమ్‌లో ప్రణరు సత్తా చాటాడు. తొలి ర్యాలీ నుంచే ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా 8 పాయింట్లు కొల్లగొట్టిన ప్రణరు 11-5, 14-6తో చెలరేగాడు. విరామం తర్వాత లిన్ డాన్ కేవలం రెండు పాయింట్లే సాధించగలిగాడు. 21-7తో అలవోకగా గేమ్ నెగ్గిన ప్రణరు ప్రీ క్వార్టర్స్‌లోకి కాలుమోపాడు. క్వార్టర్‌ఫైనల్స్ దారిలో ప్రణరు కఠిన సవాల్ ఎదుర్కొవాల్సి ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న మోమోటను ఓడించటం ప్రణరుకి అంత సులువు కాదు. జపాన్ స్టార్‌తో ముఖాముఖిలో ప్రణరు 0-4తో దారుణ రికార్డు కలిగి ఉన్నాడు. మోమోటపై కెరీర్ తొలి విజయం సాధించాలంటే ప్రణరు తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలి.
మరో షట్లర్ బి. సాయిప్రణీత్ సైతం ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 21-16, 21-15తో కొరియా షట్లర్ లీ డాంగ్‌పై వరుస గేముల్లో గెలుపొందాడు. పురుషుల డబుల్స్‌లో అరుణ్ జార్జ్, శుక్లా జోడీ పరాజయం పాలైంది. జపాన్ జోడీ టకుటో, యూకీ చేతిలో 18-21, 11-21తో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంటకు వాకోవర్ లభించింది. చైనీస్ తైపీ జంట చాంగ్ చింగ్, యాంగ్ చింగ్‌లు గాయంతో బరిలోకి దిగలేదు!. నేడు రెండో రౌండ్లో ఏడో సీడ్ చైనా జోడీ డు యో, లి యిన్లతో అశ్విని,సిక్కి తలపడను న్నారు.
సైనా, సింధు పోరు నేడు : ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించి స్వర్ణంపై కన్నేసిన పి.వి సింధు మహిళల సింగిల్స్‌లో పసిడి వేటను నేడు మొదలెట్టనుంది. తొలి రౌండ్లో సింధుకు బై లభించింది. నేడు రెండో రౌండ్లో చైనీస్ తైపీ ప్లేయర్ పై యు పో, బల్గేరియా షట్లర్ లిందాలలో ఒకరు సింధుకు ఎదురు కానున్నారు. అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్‌కు సైతం తొలి రౌండ్లో బై లభించింది. స్విస్ షట్లర్ సబ్రియా, నెదర్లాండ్స్ ప్లేయర్ సోరయాలలో ఒకరు సైనాతో తలపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి సింధు, సైనా ఇద్దరే ఆడుతున్నారు