Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్‌పై దిగ్గజ షూటర్ ఆశలు
న్యూఢిల్లీ : భారత దిగ్గజ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ కాంపిటీటివ్ సర్క్యూట్ నుంచి తప్పుకుని చాలా కాలం అవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్ మొదలైన తరుణంలో ఐదో ఒలింపిక్స్ ప్రాతినిథ్యంపై నారంగ్ గురి పెట్టాడు. అద్భుతం కోసం పని చేస్తున్నానని నారంగ్ తెలిపాడు. ' శిక్షణ ప్రారంభించాను. టోక్యో ఒలింపిక్స్ సాధ్యమవుతుందా, లేదా అని రానున్న టోర్నీలు తేల్చుతాయి. వచ్చే నెలలో సెలక్షన్ ట్రయల్స్ ఉన్నాయి. ఎంపికైతే ఆసియా చాంపియన్‌షిప్స్‌కు వెళ్తాను. అక్కడి నుంచి భిన్నమైన మార్గం అనుసరించాలి. ప్రస్తుతానికి ఓ అద్భుతం ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నాను' అని గగన్ నారంగ్ తెలిపాడు. 36 ఏండ్ల గగన్ నారంగ్ ప్రస్తుతం సొంత అకాడమీలో వర్థమాన షూటర్లకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. మెంటర్‌గా విజయం, వ్యక్తిగత విజయం ఎప్పటికీ కాలేదని నా నమ్మకం, అందుకే మరోసారి గన్‌తో గురి పెట్టాలని అనుకుంటున్నానని నారంగ్ అన్నాడు.