Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలైవాస్‌పై బుల్స్ విజయం
- ప్రొ కబడ్డీ లీగ్ 7
బెంగళూర్ : సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో భంగపడిన బెంగళూర్ బుల్స్, ప్రియ ప్రత్యర్థి తమిళ తలైవాస్‌పై మెరుపు విజయం సాధించింది. యువ సంచలనం పవన్ షెరావత్ కూతలో కేక పుట్టించగా 33-27తో ఆరు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్ గెలుపు బాట పట్టింది. పవన్ షెరావత్ 17 రైడ్ పాయింట్లతో బుల్స్ విజయంలో కీలక భూమిక వహించాడు. కెప్టెన్ రోహత్ కుమార్ ఐదు పాయింట్లతో మెరిశాడు. అమిత్ ఐదు ట్యాకిల్స్‌తో తలైవాస్ ఆట కట్టించాడు. తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి పేలవ ఫామ్ కొనసాగుతోంది. 16 రైడ్లలో రాహుల్ 8 పాయింట్లే సాధించాడు. కెప్టెన్ అజరు ఠాకూర్ సైతం నాలుగు పాయింట్లకే పరిమితయ్యాడు. డిఫెండర్లు మంజిత్ చిల్లార్, మోహత్ చిల్లార్‌లు వరుసగా 4, 3 ట్యాకిల్స్‌తో రాణించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌పై యూపీ యోధ ప్రతీకార విజయం సాధించింది. 32-29తో మూడు పాయింట్ల తేడాతో గెలుపొందింది. నేడు పీకెఎల్లో తెలుగు టైటాన్స్, తమిళ తలైవాస్ తలపడనున్నాయి.