Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మిస్బా-వుల్-హక్ ఆ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(పిసిబి) మిస్బాను హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కోచ్ పదవి కోసం పలువురు దిగ్గజాలు పోటీ పడ్డప్పటికీ మిస్బావుల్‌కే పీసీబీ పెద్దలు పెద్ద పీట వేశారు. మూడేళ్ల పాటు మిస్బాను కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, పాకిస్తాన్‌కు చెందిన ఆరు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ జట్ల కోచ్‌లకు చీఫ్ సెలక్టర్‌గా కూడా మిస్బావుల్నే ఎంపిక చేయడం విశేషం. దాంతో దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి హెడ్ కోచ్‌ల పని తీరును కూడా మిస్బావులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్‌ను ఎంపిక చేశారు. గతంలో పాకిస్తాన్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న వకార్‌పై మరోసారి నమ్మకం ఉంచుతూ బౌలింగ్ కోచింగ్ బాధ్యతలు అప్పగించింది.