Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాపై టెస్టు విజయం చేరువలో అఫ్ఘనిస్థాన్
చిట్టగాంగ్ : అఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు చరిత్రకు చేరువైంది. టెస్టు క్రికెట్లో చారిత్రక సన్నివేశానికి నాలుగు అడుగుల దూరంలో నిలిచింది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో అఫ్ఘనిస్థాన్ మెగా విజయం ముంగిట నిలిచింది. బంగ్లాదేశ్‌కు 398 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన అఫ్గాన్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలబడింది. రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్ 136/6తో పోరాడుతోంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/46), జహీర్ ఖాన్ (2/36) బంగ్లాదేశ్ నడ్డి విరిచారు. లిటన్ దాస్ (9), మొసద్దెక్ హుస్సేన్ (12), ముష్ఫీకర్ రహీమ్ (23), మొమినుల్ హాక్ (3), మహ్మదుల్లా (7) స్వల్ప స్కోర్లకు అవుటయ్యారు. ఓపెనర్ షాదామ్ ఇస్లాం (41) పోరాట పటిమ కనబరిచాడు. నాల్గో రోజు వర్షం అంతరాయంతో ఆట ముగిసే సమయానికి షకిబ్ అల్ హసన్ (39 నాటౌట్), సౌమ్య సర్కార్ (0) అజేయంగా ఆడుతున్నారు. ఐర్లాండ్‌పై అఫ్గనిస్థాన్ టెస్టు విజయాన్ని సాధించినా.. బంగ్లాదేశ్‌పై టెస్టు విజయం అఫ్గాన్ సత్తాను చాటనుంది. ఐర్లాండ్, అఫ్గాన్లు ఒకే సారి టెస్టు జట్టు హౌదా పొందిన సంగతి తెలిసిందే.