Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్
పారిస్ : 2018ను 200 పైచిలుకు ర్యాంక్‌తో ముగించిన కెనడా యువ సంచలనం బియాంక ఆండ్రిస్కూ మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-5లోకి ప్రవేశించింది. టూర్ టైటిళ్ల విజయంతో వరల్డ్ నం.15తో యుఎస్ ఓపెన్ టైటిల్ వేట ఆరంభించిన ఆండ్రిస్కూ కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయంతో వరల్డ్ నం.5గా అవతరించింది. 2017, 2018లలో వరుసగా ప్రధాన టోర్నీకి అర్హత సాధించటంలో విఫలమైన ఆండ్రిస్కూ తొలి ప్రయత్నంలోనే యుఎస్ ఓపెన్ టైటిల్‌ను అందిపుచ్చుకుంది. అమెరికా క్రీడాకారిణి ఆష్లె బార్టీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, జపాన్ భామ నవొమి ఒసాక నాలుగో స్థానానికి పడిపోయింది. కరొలినా ఫ్లిస్కోవా, ఎలినా స్విట్లోనా 2, 3వ స్థానాల్లో ఉన్నారు. వింబుల్డన్ విజేత సిమోన హలెప్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. సెరెనా విలియమ్స్ టాప్-10లో కొనసాగుతోంది.