Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్ర వేటలో సెరెనా విలియమ్స్
- రీ ఎంట్రీలో అసమాన పోరాటం
నాలుగు వారాల గర్భంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో టెన్నిస్ చరిత్రలో ఆల్ ఐమ్ రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. గ్రాండ్‌స్లామ్స్ అంతిమ పోరాటాల్లో అత్యధిక సార్లు పోటీపడిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మార్గరెట్ కోర్ట్ (24) రికార్డుకు ఆమె ఓ అడుగు దూరంలో నిలిచింది. ఆమె అమెరికా క్రీడా దిగ్గజం, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.
ప్రాణాంతక సమస్యలను అధిగమించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్‌ను మళ్లీ టెన్నిస్ కోర్టులో చూడగలమా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రసవ సమయంలో క్లిష్టమైన సమస్యలు చవిచూసిన సెరెనా, సంక్లిష్టమైన శస్త్రచికిత్సలకు సిద్ధపడింది. ఈ పరిస్థితుల్లో సాధారణ ఆరోగ్య స్థాయికి చేరుకోటమే కష్టసాధ్యం.
పోరాట యోధురాలు సెరెనా ముందు ఈ సమస్యలు ఎంతోకాలం నిలువలేదు. అడ్డంకుల్ని అణచివేసిన సెరెనా, మెరుపు వేగంతో టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టింది. రీ ఎంట్రీలో ఏకంగా నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. మరో టైటిల్ నెగ్గినా, లేకపోయినా మహిళల టెన్నిస్‌లో సెరెనా దిగ్గజ స్థాయికి ఢోకా లేదు. అయినా, సెరెనా చరిత్ర వేటలో అసమాన పోరాటం సాగిస్తోంది.
శ్రీనివాస్ దాస్ మంతటి
టెన్నిస్, గ్రాండ్‌స్లామ్ విజయాలు అనగానే సగటు అభిమానుల మదిలో స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్, స్పెయిన్ బుల్ రపెల్ నాదల్, సెర్బియా చిన్నోడు నొవాక్ జకోవిచ్‌లు మదిలో మెదులుతారు. టెన్నిస్‌లోనే కాదు ఏ క్రీడలోనైనా దిగ్గజాలు అనగానే ముందుగా పురుష అథ్లెట్లే కనిపిస్తారు. కానీ టెన్నిస్‌లో ఓ చిన్న మినహాయింపు. ఫెడరర్ స్థాయి గుర్తింపు దక్కకపోయినా, సెరెనా విలియమ్స్ దిగ్గజాల జాబితాలో ముందు వరుసలోనే వస్తుంది. అందుకు కారణం ఆమె సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ విజయాలే కాదు, అలుపెరుగని పోరాట తత్వం సెరెనాను దిగ్గజంగా నిలిపింది. 38 ఏండ్ల వయసులో, ఓ బిడ్డకు తల్లిగా సెరెనా విలియమ్స్ నుంచి అభిమానులే కాదు, టెన్నిస్ పండితులూ ఏమీ ఆశించలేదు. నిజానికి, ప్రొఫెషనల్ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకునే సమయంలో సెరెనా చరిత్రను వేటాడుతోంది. రీ ఎంట్రిలో సెరెనా ప్రదర్శనపై ఎన్నో అనుమానాలను ఆమె పటాపంచలు చేసింది. నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో పోటీపడింది.
ఆఖర్లో ఏమవుతోంది? : పునరాగమనంలో సెరెనా విలియమ్స్ ఏకంగా నాలుగు గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ ముంగిట నిలిచింది. 2018లో వింబుల్డన్, యుఎస్ ఓపెన్.. 2019లో వింబుల్డన్, యుఎస్ ఓపెన్లలో తుది సమరానికి చేరుకుంది. లేటు వయసులోనూ సెరెనా విలియమ్స్ సర్వ్ పవర్లో మార్పు రాలేదు. రిటర్న్ షాట్లలో తేడా కనిపించదు. ర్యాలీలో తడబాటు ఉండదు. ఏస్‌లలో పదును, విన్నర్లలో జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ నాలుగు గ్రాండ్‌స్లామ్స్ ఫైనల్స్‌లో సెరెనా ప్రయాణం అద్వితీయం. తొలి రౌండ్ నుంచి సెమీఫైనల్స్ వరకూ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు సాధించింది. ప్రత్యేకించి సెమీఫైనల్స్ సమరాల్లో వరుస సెట్లలో విజయాలు సాధించింది. 24వ గ్రాండ్‌స్లామ్ విజయం లాంఛనమే అనుకునేలా చేసింది. కానీ అంతిమ సమరాల్లో సెరెనా ప్రదర్శన ఆశ్చర్యకరం. రీ ఎంట్రీలో తనను తాను నిరూపించుకోవాలే తపనో, తల్లిగా తొలి మెగా విజయం అందుకోవాలనే ఆరాటమో ఏమో తెలియదు. కానీ తుది మెట్టుపై అనూహ్యంగా పేలవ ప్రదర్శన చేసింది. 2018 వింబుల్డన్ ఫైనల్లో ఎంజెలికా కెర్బర్, 2019 వింబుల్డన్‌లో సిమోన హలెప్.. 2018 యుఎస్ ఓపెన్‌లో నవొమి ఒసాక, 2019లో తాజాగా బియాంకా ఆండ్రిస్కూలు సెరెనా విలియమ్స్‌ను ఒత్తిడిలోకి నెట్టి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలను ఎగరేసుకుపోయారు. 38 ఏండ్ల సెరెనా విలియమ్స్‌ను ఎదుర్కొనేందుకు నవ తరం క్రీడాకారిణులు భయం పడటం లేదు. ఆమె ఇక ఎంత మాత్రం మునుపటి స్థాయిలో ప్రమాదకారి కాదనే అభిప్రాయం ఫైనలిస్ట్‌లో ఏర్పడింది. అందుకే తొలిసారి ఫైనల్స్‌కు చేరిన ఆండ్రిస్కూ సైతం అద్భుత రీతిలో అధైర్యపడకుండానే దూకుడుగా ఆడింది. దిగ్గజంతో తలపడుతున్న భావనే లేకుండా సూపర్ ప్రదర్శనతో విజయం సొంతం చేసుకుంది. గతంలో ఈ పరిస్థితి లేదు. సెరెనాను ఆవల కోర్టులోనే చూడగానే మానసికంగా మ్యాచ్‌లను అప్పగించేవారు. ఇప్పుడా పరిస్థితి ఎంతమాత్రం లేదు. దీనికి తోడు పునరాగమనంలో రికార్డు టైటిల్ వేట సెరెనా విలియమ్స్‌పై కొండంత భారం మోపుతోంది.
యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా ప్రదర్శన అసమానం. తొలిసారి ఫైనలిస్ట్ బియాంక ఆండ్రిస్కూ తొలి సెట్‌ను 6-3తో సలువుగా సొంతం చేసుకుంది. రెండో సెట్‌ను 5-1తో లాంఛనం చేసుకుంది. ఈ దశలో సెరెనా పుంజుకున్న తీరు అమోఘం. వరుస పాయింట్లతో రేసులోకి వచ్చిన సెరెనా విలియమ్స్ 5-5తో స్కోర్లు సమం చేసింది. సొంత అభిమానుల నడుమ సెరెనా విలియమ్స్ ఎదురుదాడితో ఇక టైటిల్ ఆమెదే అనిపించింది. 38 ఏండ్ల వయసులో తిరుగులేని ఫిట్నెస్ స్థాయి కలిగిన ఆండ్రిస్కూపై సెరెనా చెలరేగిన తీరు అభిమానుల్లో ఆసక్తి రేపింది. కానీ వింబుల్డన్‌లో రెండుసార్లు, గతేడాది యు.ఎస్ ఓపెన్ ఫైనల్లో ఎదురైన ఫలితమే న్యూయార్క్ లోనూ చవిచూ సింది. మెరుగైన ప్రదర్శనతో తిరిగొచ్చినా, భీకర ఫామ్ అందు కున్నా టైటిల్ ఆమెకు అందలేదు. ఓ గొప్ప అథ్లెట్‌ను నిర్ణయించేది ప్రయా ణమే, కానీ గమ్యం కాదు!. సవాళ్లను ఛేదించి సెరెనా విలియమ్స్ నాలుగు పర్యాయాలు రికార్డు గ్రాండ్‌స్లామ్ ముంగిట నిలిచినా ఆమె పోరాటం అద్వితీయం. ఈ నాలుగు ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్ అంతిమ విజేతగా నిలువులేదు. కానీ 24వ గ్రాండ్‌స్లామ్ వేట సెరెనా విలియమ్స్‌ను తిరుగులేని పోరాట యోధురాలిగా నిలిపింది. అలుపెరుగని పోరాటంతో చరిత్రను ఛేదిస్తున్న సెరెనా విలియమ్స్, రికార్డు టైటిల్లో సంబంధం లేకుండా భావితరాలకు స్ఫూర్తిపతాకగా నిలిచింది. సెరెనా పోరాట స్ఫూర్తికైనా 24వ గ్రాండ్‌స్లామ్ విజయం వచ్చే ఏడాది సలాం చేస్తుందేమో చూడాలి.
ప్రాణాంతక సమస్యల నడుమ బిడ్డకు జన్మనిచ్చి, తిరిగి రాకెట్ పట్టిన సెరెనా విలియమ్స్ నుంచి ఏం ఆశించాలో అర్థం కాలేదు. పునరాగమనంలో సెరెనా గ్రాండ్‌స్లామ్ విజయం సాధించలేదు. కానీ ఆమె ఏకంగా నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహి ళల సింగిల్స్ సర్క్యూట్లో ఈ నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ విజేతలు మారారు. ఒక్కో గ్రాం డ్స్లామ్కు ఒక్కో విజేత వచ్చింది. నిలకడగా ప్రదర్శన చేసి ప్రతిసారీ ఫైనల్స్‌కు చేరినది సెరెనా విలియమ్స్ మాత్రమే. సెరెనా కచ్చితంగా 24వ గ్రాండ్‌స్లామ్ విజయం సాధిస్తుం దనే నమ్మకం ఉంది'
- ప్యాట్రిక్, సెరెనా శిక్షకుడు