Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిషబ్ పంత్‌పై క్లూసెనర్
న్యూఢిల్లీ : భారత యువ వికెట్ కీపర్, ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌పై ఢిల్లీ రంజీ జట్టు మాజీ సలహాదారు, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్సె క్లూసెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు టీ20, మూడు టెస్టుల కోసం భారత్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుతో సలహాదారుగా ఇక్కడికొచ్చిన క్లూసెనర్ మీడియాతో మాట్లాడాడు. ' ఇలా వేలెత్తి చూపటం నాకు కష్టమే కానీ, అపార ప్రతిభావంతుడైన రిషబ్ పంత్ వాస్తవం మరిచి, భవిష్యత్‌లో తేలియాడుతున్నాడు' అని క్లూసెనర్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా నిలదొక్కుకోవాలంటే ఎదుటివారి పొరపాట్లను చూసి పాఠాలు నేర్చుకోవాలి. మన పొరపాట్లను తెలుసుకుని, మెరుగయ్యేందుకు ఇక్కడ సమయం ఉండదు. రిషబ్ పంత్‌కు కొంత సమయం అవసరం. సమయం ఇస్తే అతడు సత్తా చాటగలడు. కోచింగ్ బృందం నుంచి పంత్ సలహాలు తీసుకోవాలి. అలాగని సహజ శైలి ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరం లేదని క్లూసెనర్ అన్నాడు. క్రీజులో మెరుగ్గా కనిపిస్తున్నా పేలవ షాట్ సెలక్షన్‌తో పంత్ తరచుగా వికెట్ కోల్పోవటం విమర్శలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎస్ ధోని లేకపోవటంతో మూడు ఫార్మాట్లకు రిషబ్ పంత్‌ను టీమ్ ఇండియా ప్రథమ ప్రాధాన్య వికెట్ కీపర్‌గా పరిగణిస్తోంది.