Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత కోచ్ కిమ్ రాజీనామా
నవతెలంగాణ, హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ గోల్డెన్ గర్ల్ పి.వి సింధుకు ఊహించని ఎదురుదెబ్బ!. కొరియా కోచ్ కిమ్ జీ హ్యున్ పర్యవేక్షణలో ఆటలో కీలక మార్పులు చేసుకున్న సింధు.. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం గెల్చుకుంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో పసిడి అధ్యాయానికి తెరతీసింది. కొరియా జాతీయ కోచ్‌గా కొనసాగిన కిమ్, ఆసియా క్రీడల్లో కొరియా జట్టు నిరాశపరచటంతో ఉద్వాసనకు గురైంది. పుల్లెల గోపీచంద్ చొరవతో కిమ్‌ను భారత బ్యాడ్మింటన్ సంఘం కోచ్‌గా తీసుకుంది. కిమ్ భర్త ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. ఈ సమయంలో కిమ్ తన భర్త దగ్గరుండి ఆరోగ్య సంరక్షణ చూసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఆమె న్యూజి లాండ్లో ఉంటోన్న భర్త వద్దకు చేరుకుంది. తిరిగి హైదరాబాద్‌కు వచ్చే ఆలోచనలో లేదని తెలిసింది. రాజీనామాను సైతం బారుకి పంపినట్టు సమాచారం. కిమ్ శిక్షణ చొరవ, ప్రత్యేక వ్యూహంతోనే వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి సాధించానని సింధు పదేపదే తెలిపిన సంగతి తెలిసిందే. కిమ్ రాజీనామాతో నేషనల్ చీఫ్ కోచ్ గోపీచంద్‌పై పని భారం మరింత అధికం కానుంది.