Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో మిల్మాన్పై విజయం
టోక్యో : వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జపాన్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. భుజం గాయంతో యు.ఎస్ ఓపెన్ నాల్గో రౌండ్ నుంచే తప్పుకున్న జకోవిచ్.. ఫిట్నెస్ సాధించిన తర్వాత తొలిసారి బరిలోకి దిగాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్ మిల్మాన్పై 6-3, 6-2తో జకోవిచ్ వరుస సెట్లలో విజయం సాధించాడు. అరంగేట్ర టోర్నీలోనే టైటిల్ సొంతం చేసుకోవటం జకోవిచ్‌కు పదోసారి. తొలిసారి జపాన్ ఓపెన్‌లో తలపడిన జకోవిచ్ కెరీర్ 76వ ఏటీపీ టైటిల్ గెల్చుకున్నాడు. 69 నిమిషాల్లోనే విజయం అందుకున్న జకోవిచ్‌కు తుది సమరంలో పెద్దగా పోటీ ఎదురు కాలేదు. జాన్ మిల్మాన్ ప్రతిఘటించలేదు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా జకోవిచ్ సులువైన విజయం సాధించాడు.