Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చికాగో: బాక్సింగ్ రింగ్‌లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన బాక్సింగ్ బౌట్లో తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిన అమెరికాకు చెందిన పాట్రిక్ డే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. శనివారం చికాగోలో జూనియర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చార్లస్ కాన్వెల్తో జరిగిన మ్యాచ్‌లో పాట్రిక్ నాకౌట్ అయ్యాడు. చార్లస్ కాన్వెల్ నుంచి వచ్చిన బలమైన పంచ్‌లకు పాట్రిక్ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. దాంతో అతడ్ని స్ట్రెచర్‌పై ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పాట్రిక్‌ను బతికించడం కోసం డాక్టర్లు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. నాలుగు రోజు పాటు మృత్యువుతో పోరాడిన పాట్రిక్ బుధవారం ప్రాణం విడిచినట్లు అతని ప్రమోటర్ డిబెల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల రష్యా చెందిన బాక్సర్ మాక్సిమ్ డడ్‌షెవ్, అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్లకు ఇదే తరహాలో మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.