Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింధు, సైనా పేలవ ఫామ్
- నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
పారిస్ : ప్రపంచ చాంపియన్‌గా అవతరించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన స్టార్ షట్లర్ పి.వి సింధు. ప్రపంచ చాంపియన్‌షిప్స్ టైటిల్లో శిఖర విజయం అందుకున్న సింధు.. తర్వాతి టోర్నీల్లో దారుణ ప్రదర్శనతో నిరాశ పరిచింది. వరుసగా చైనా, కొరియా, డెన్మార్క్ ఓపెన్లలో రెండో రౌండ్‌కు ముందే ఇంటి బాట పట్టింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్ తర్వాత సింధు కోర్టు కదలికల్లో మందకోడితనం కనిపిస్తోంది. దీంతో వరుస పరాజయాలకు బ్రేక్ వేయాలని సింధు గట్టి సంకల్పంతో కనిపిస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్‌తో విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సింధు తొలి రౌండ్లో కెనడా షట్లర్‌తో తలపడనుంది. వరల్డ్ నం.9 మిచెలీ లీ గతంలో రెండుసార్లు సింధుపై గెలుపొందింది. ఈ నేపథ్యంలో తొలి రౌండ్ మ్యాచ్ సైతం సింధుకు కీలకమే. ఆరంభ రౌండ్లలో మెరిస్తే క్వార్టర్ఫైనల్లో సింధుకు తైజు యింగ్ ఎదురుయ్యే అవకాశం ఉంది. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సైతం వరుసగా గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. హాంగ్‌కాంగ్ షట్లర్ చెంగ్ నగాన్తో సైనా తొలి రౌండ్లో పోటీపడనుంది. పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నాడు. పేలవ ఫామ్, గాయాల తర్వాత శ్రీకాంత్ అంతర్జాతీయ సర్క్యూట్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత బి. సాయిప్రణీత్, హెచ్.ఎస్ ప్రణరు సహా కామన్వెల్త్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నిలిచారు. డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప రేసులో ఉన్నారు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి సహా మను అత్రి, సుమిత్ రెడ్డి జోడీ బరిలో ఉన్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సాత్విక్‌సాయి జంటపై మెడల్ ఆశలు ఉన్నాయి.