Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
హాంకాంగ్: భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోటీలో శ్రీకాంత్ 21-13తో తొలిసెట్ కైవసం చేసుకున్న అనంతరం చైనా షట్లర్ చెన్‌లాంగ్ గాయం తిరగబెట్టడంతో టోర్నీనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కిదాంబి శ్రీకాంత్ రెండోసెట్ ఆడకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 5వ సీడ్ చెన్ లాంగ్(చైనా)పై శ్రీకాంత్‌కు ఇది రెండో విజయం మాత్రమే. వీరిద్దరూ ఇప్పటివరకూ 8సార్లు తలపడగా... చైనా షట్లర్ 6సార్లు గెలిచాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మలేషియా ఓపెన్‌లో వీరిద్దరూ క్వార్టర్ఫైనల్లో తలపడగా చెన్‌లాంగ్ వరుస గేముల్లో కిదాంబిపై గెలిచాడు. 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి చెన్‌లాంగ్‌ను ఓడించిన కిదాంబి ఆ ఏడాది టైటిల్ విజేతగా నిలిచాడు. సెమీస్‌లో శ్రీకాంత్ ఆతిథ్యజట్టుకు చెందిన లీ-చెక్-యు(హాంకాంగ్)తో తలపడతాడు. క్వార్టర్స్‌లో చెక్-యు 21-14, 21-19తో 7వ సీడ్ అక్సెల్సన్(ఇంగ్లండ్)పై గెలిచాడు.
సెమీఫైనల్స్(సింగిల్స్)
మహిళలు:
బివెన్ జంగ్(అమెరికా) × చెన్-యుఫీ(చైనా)
ఇంటనాన్(థారులాండ్) × యమగుచి(జపాన్)
పురుషులు:
కిదాంబి శ్రీకాంత్(భారత్) × లీ-చెక్-యు(హాంకాంగ్)
జొనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా) × ఆంటోని గిన్టింగ్