Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే చారిత్రాత్మక డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌కు దాదాపు టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. తొలి మూడు రోజుల ఆటకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయిన విషయాన్ని గంగూలీ శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశాడు. ఇలా టెస్టు మ్యాచ్‌కు టికెట్లు అమ్ముడు పోవడంతో హ్యాపీగా ఉన్నామన్నాడు. 'ఆన్లైన్లో పెట్టిన టికెట్లన్నీ సేల్ అయిపోయారు. కేవలం కోటా టికెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. దాంతో మేమంతా సంతోషంగా ఉన్నాం' అని గంగూలీ పేర్కొన్నాడు.