Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిషబ్ పంత్కు వీవీఎస్ సూచన
ముంబయి : జట్టు మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైందని యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. ' జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ పంత్కు సంజూ శాంసన్ రూపంలో మరో అవకాశం ఉందనే గట్టి సందేశం పంపించింది. రిషబ్ పంత్కు చాలా అవకాశాలు లభించాయి. టీమ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని పంత్కు తెలియజేసి, అతడికి ధైర్యం నూరిపోస్తుందని నేను అనుకుంటున్నాను. అంతిమంగా రిషబ్ పంత్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దురదృష్టశావతు పంత్ ఆ పని చేయటం లేదు. పంత్ ప్రత్యేకమైన ఆటగాడు అని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. మ్యాచ్ను అలవోకగా మలుపు తప్పిగల సత్తా, సామర్థ్యం పంత్ సొంతం' అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.