Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమోదించిన డీడీసీఏ అంబుడ్స్మన్
న్యూఢిల్లీ : ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు రజత్ శర్మ రాజీనామా చేశారు. క్రికెట్ సంఘంలో అంతర్గత ఒత్తిడి, కలహాల కారణంగా పదవిలో కొనసాగలేనని రజత్ శర్మ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రజత్ శర్మ రాజీనామాను డీడీసీఏ అంబుడ్స్మన్ శుక్రవారం ఆమోదించారు. సుమారు రెండేండ్లుగా ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారతో రజత్ శర్మ బహిరంగ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రజత్ శర్మ రాజీనామా నేపథ్యంలో డీడీసీఏ సీఈవో రవి చొప్రా సైతం పదవి నుంచి తప్పుకున్నారు. ఇద్దరు సభ్యుల క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) సునీల్ వాల్సన్, యశ్పాల్ శర్మలు సైతం శుక్రవారం ప్యానల్ నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 23న బీసీసీఐ ఎన్నికల నేపథ్యంలో డీడీసీఏ ప్రతినిధిగా రజత్ శర్మ బోర్డు సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో పాల్గొనటాన్ని సైతం కొందరు సవాల్ చేసిన సంగతి తెలిసిందే.