Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • నేడే కిసాన్‌ గణతంత్ర పరేడ్‌
  • నేడు ఉప్పల్‌ స్టేడియం వరకు వాహనాల ర్యాలీ
  • డివైడర్ ను ఢీ కొట్టిన బస్సు: 12 మందికి గాయాలు
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భారత్‌ 2-0 పాకిస్థాన్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

భారత్‌ 2-0 పాకిస్థాన్‌

Sat 30 Nov 00:09:43.752258 2019

- రామ్‌కుమార్‌, సుమిత్‌ నాగల్‌ జోరు
- రెండు సింగిల్స్‌లోనూ భారత్‌ గెలుపు
- పాకిస్థాన్‌తో డెవిస్‌ కప్‌ పోరు
- నూర్‌ సుల్తాన్‌ (కజకిస్థాన్‌)
ఆట ఏదైనా, వేదిక ఎక్కడైనా.. ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్‌ ఆధిపత్యం అసమానం. డెవిస్‌ కప్‌లో గత ఆరు ముఖాముఖి మ్యాచుల్లో పాకిస్థాన్‌పై అజేయ రికార్డు కలిగిన టీమ్‌ ఇండియా, తాజాగా ఆ రికార్డును మరింత మెరుగుపర్చుకునే దిశగా గట్టి ముందడుగు వేసింది. తటస్థ వేదిక నూర్‌ సుల్తాన్‌లో జరుగుతున్న ఆసియా ఓసియానా గ్రూప్‌-1 డెవిస్‌ కప్‌ మ్యాచ్‌ తొలి రోజు భారత్‌ అదిరే ఆరంభం చేసింది. ఐదు మ్యాచుల పోటీలో ప్రస్తుతం భారత్‌ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతోంది.
తొలి రెండు సింగిల్స్‌ మ్యాచుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. తొలి మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ 42 నిమిషాల్లోనే వరుస సెట్లలో ఘన విజయం సాధించాడు. 17 ఏండ్ల పాకిస్థాన్‌ యువ ఆటగాడు మహ్మద్‌ షోయబ్‌ భారత స్టార్‌ ముందు చేతులెత్తేశాడు. రామ్‌కుమార్‌ 6-0, 6-0తో షోయబ్‌పై ఎదురులేని విజయం నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో యువ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ కెరీర్‌ తొలి డెవిస్‌ కప్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అబ్దుల్‌ రెహమాన్‌పై 6-0, 6-2తో నాగల్‌ ఘన విజయం అందుకున్నాడు. ' ఇంతకంటే మెరుగైన ఆరంభం ఉండదు. 2-0 ఆధిక్యం సాధించాం. దీంతో డబుల్స్‌ జోడీపై ఎంతో ఒత్తిడి తగ్గింది. ఈ విజయం కోసం ఆటగాళ్లు ఎంతో ఎదురుచూశారు. నేటి మ్యాచ్‌ కోసం ఆసక్తిగా చూస్తున్నాం' అని భారత నాన్‌ప్లేయింగ్‌ కెప్టెన్‌ రాజ్‌పాల్‌ పేర్కొన్నాడు. ' భారత్‌కు ప్రాతినిథ్యం వహించటం మాటల్లో వర్ణించలేని అనుభూతి. ప్రతి భారతీయుడీ ఇదే భావన. ప్రతి పాయింట్‌కు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భావించాను. ఎంతో ఏకాగ్రతతో ఆడాను. పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే కెరీర్‌ మొదలు పెడుతున్నారు, అయినా మేం వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాం. మైదానంలో పోటీపడుతున్నప్పుడు భారత అభిమానుల మద్దతు ఎల్లప్పుడూ అదనపు అనుకూలత. ఇది ఎంతో ఆత్మివిశ్వాసం అందిస్తుంది. ఏ మ్యాచ్‌లోనైనా అభిమానుల మద్దతు ఉపయోగపడుతుంది' అని రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌ పేర్కొన్నాడు.
భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన డెవిస్‌ కప్‌ మ్యాచ్‌ను తటస్థ వేదికకు మార్చటంపై పాకి స్థాన్‌ రెగ్యులర్‌ టెన్నిస్‌ క్రీడాకారులు తీవ్రంగా నిరసించారు. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య నిర్ణయానికి నిరసనగా సీనియర్‌ ఆటగాళ్లు భారత్‌తో డెవిస్‌ కప్‌ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. సీనియర్ల గైర్హాజరు డెవిస్‌ కప్‌లో పాకిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ. రెండు సింగిల్స్‌ మ్యాచుల్లోనూ పాకిస్థాన్‌ ప్లేయర్లు షోయబ్‌, రెహమాన్‌లు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. రెండు మ్యాచుల్లోనూ పాకిస్థాన్‌ దారుణ ఓటమి చవిచూసింది. ఈ డెవిస్‌ కప్‌ పోరులో నెగ్గిన జట్టు 2020 డెవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌లో పాల్గొంటుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్మిత్‌ ను ఎంచుకున్నాను
సగం మీసం తీసేస్తా!
ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.