Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి ఓడిన షట్లర్ సౌరభ్ వర్మ
- సయ్యద్మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింట్ టోర్నీ
న్యూఢిల్లీ : ఈ ఏడాది హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన భారత షట్లర్ సౌరభ్ వర్మ ఆశలు ఆవిరయ్యాయి. చివరి వరకు పోరాడినా నిరాశే మిగిలింది. సయ్యద్మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సౌరభ్ వర్మ ఓటమిపాలయ్యారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో చైనీ తైపీ ఆటగాడు వాంగ్ జు వీ చేతిలో 15-21, 17-21 తేడాతో ఓటమిపాలయ్యారు. 48 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో సౌరభ్ చివరి వరకు నిలకడగా పోరాడినా టైటిల్‌ను కైవసం చేసుకోలేకపోయారు. తొలి గేమ్ ఆదిలో 1-3తో వెనుకబడిన అతడు విరామ సమయానికి 10-11తో పోటీనిచ్చారు. కానీ, తర్వాత వాంగ్ పుంజుకుని 21-15తో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఆటను తనవైపునకు తిప్పుకున్నారు. రెండో గేమ్‌లోనూ సౌరభ్‌కు శుభారంభం దక్కలేదు. 0-5తో వెనుకంజలో నిలిచిన అతడు విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. హౌరాహౌరీగా సాగిన రెండో గేమ్‌లో ప్రత్యర్థి పైచేయి సాధించాడు. మరో గేమ్ మిగిలుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ ఏడాదిలో సౌరభ్ వర్మ.. హైదరాబాద్, వియత్నాం టైటిల్‌లను గెలుచుకున్న విషయం తెలిసిందే.