Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్-10 మహ్మద్ షమి
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్ : క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి మళ్లీ అగ్రస్థానం అందుకున్నాడు. బంగ్లాదేశ్‌పై 136 పరుగుల శతకం బాదిన భారత కెప్టెన్ రేటింగ్ పాయింట్లలో 928కి చేరుకున్నాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాకిస్థాన్‌పై 36 పరుగులే చేశాడు. దీంతో స్మిత్ రేటింగ్ పాయింట్లు 931 నుంచి 923కి పడిపోయింది. విరాట్ కోహ్లి తిరిగి వరల్డ్ నం.1 టెస్టు బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. చతేశ్వర్ పుజార నాల్గో స్థానం నిలుపుకోగా.. అజింక్య రహానె ఓ స్థానం పడిపోయి ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో జశ్‌ప్రీత్ బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై టెస్టుల్లో కండ్లుచెదిరే ప్రదర్శన కనబర్చిన సీమర్ మహ్మద్ షమి తొలిసారి ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించాడు. 771 రేటింగ్ పాయింట్లతో మహ్మద్ షమి పదో స్థానం సాధించాడు.