Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలవోకగా బాదేవాడిని..
కరాచీ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 బౌలర్ జశ్‌ప్రీత్ బుమ్రాను పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ బేబీ బౌలర్ అంటూ నోరు పారేసుకున్నాడు!. క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజాక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ' నా కెరీర్లో ప్రపంచ శ్రేణి బౌలర్లను ఎదుర్కొన్నాను. కచ్చితంగా బుమ్రా వంటి బౌలర్‌పై ఆడేందుకు నాకు ఎటువంటి ఇబ్బంది పడేవాడిని కాదు. నేను క్రీజులో ఉంటే ఒత్తిడి బుమ్రాపైనే ఉండేది. దిగ్గజ బౌలర్లు గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్‌లపై సమర్థవంతంగా ఆడాను. నా ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్. బుమ్రాను అలవోకగా ఎదుర్కొనేవాడిని, ఎదురుదాడి చేసేవాడిని' అని రజాక్ వ్యాఖ్యానించాడు. రజాక్ పాకిస్థాన్‌కు 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.