- భారత్, విండీస్ సిరీస్‌తో అమలు దుబాయ్ : భారత్, వెస్టిండీస్ సిరీస్‌తో ఓ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. హైదరాబాద్ టీ20లో నో బాల్స్‌పై ఫీల్డ్ అంపైర్లకు నిర్ణయాధికారం ఉండబోవటం లేదు. నో బాల్స్ నిర్ణయాధికారాన్ని మూడో అంపైర్‌కు (టీవీ అంపైర్) కట్టబెడుతూ ఐసీసీ గురువారం ప్రకటించింది. నూతన నిబంధనల ప్రకారం ప్రతి బంతినీ టీవీ అంపైర్ నో కోణంలో విశ్లేషించనున్నాడు. బౌలర్ గీత దాటాడని గమనిస్తే, వెంటనే ఫీల్డ్ అంపైర్‌కు సూచనలు చేస్తాడు. ఫీల్డ్ అంపైర్ నో బాల్ ప్రకటన చేశాడు. ఫీల్డ్ అంపైర్ నో బాల్ అని భావించినా.. టీవీ అంపైర్ అనుమతి లేనిదే నో బాల్ ప్రకటన చేయడానికి వీల్లేదు. క్రికెట్‌లో నూతన సాంకేతికతను అన్ని జట్లు ప్రయత్నించిన తర్వాతే భారత్ అంగీకరించిన సందర్బాలు ఉన్నాయి. తొలిసారి భారత్ నో బాల్ నిర్ణయాన్ని టీవీ అంపైర్ ప్రకటించే సిరీస్‌కు వేదిక కానుంది.