Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారీ వర్మ, జెమీమా, అరుంధతిలకు చోటు
- హర్మన్‌ప్రీత్ కౌర్, మంధాన నాయకత్వం
- 2020 టీ20 వరల్డ్‌కప్‌కు భారత మహిళల జట్టు
నవతెలంగాణ, ముంబయి : 2020 టీ20 వరల్డ్‌కప్ వేటకు భారత మహిళల జట్టు యువ సైన్యంతో సిద్ధమైంది. మహిళల టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరిలో జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో ముక్కోణపు టీ20 సైతం భారత్ ఆడనుంది. ముక్కోణపు టీ20 టోర్నీ, ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును మహిళల సెలక్షన్ కమిటీ ఆదివారం ఎంపిక చేసింది. 15 ఏండ్ల యువ ఓపెనర్ సఫాలీ వర్మ, 19 ఏండ్ల డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ జెమీమా రొడ్రిగస్, 23 ఏండ్ల వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన భారత టీ20 వరల్డ్‌కప్ వేటలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. విధ్వంసక బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనుంది. 2018లో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ సెమీఫైనల్లోనే మట్టికరిచింది. తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ముద్దాడేందుకు సిద్ధమవుతున్న టీమ్ ఇండియా, విచిత్రంగా ఆసీస్ పిచ్‌లపై నలుగురు స్పిన్నర్లతో వేటకు వెళ్తోంది. పూనమ్ యాదవ్, రాధ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రిచా ఘోష్‌ల రూపంలో వరల్డ్‌కప్ జట్టులో నలుగురు స్పిన్నర్లు చోటు సాధించారు. శిఖా పాండే, పూజ, అరుంధతి రెడ్డిలు పేస్ విభాగంలో నిలిచారు. హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ20లకు వీడ్కోలు పలికింది. అరుంధతి రెడ్డి రూపంలో మరో హైదరాబాదీ క్రికెటర్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనుంది.
' వరల్డ్‌కప్‌లో భారత్ గురించి చెప్పాలంటే, మా బలం స్పిన్. అందుకే స్పిన్నర్లనే నమ్ముకో వాలని అనుకున్నాం. టోర్నీలో స్పిన్నర్లను ఏ విధంగా ప్రయోగించాలనేది తేల్చుకోవాలి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్పిన్నర్లు ఎప్పుడూ ముందు నిలిచారు. వరల్డ్‌కప్‌కు ముందు ముక్కోణపు సిరీస్‌లో ఆడటం మేలు చేయనుంది. మా ప్రణాళి కలను అమలు చేసేందుకు ఈ టోర్నీ చక్కటి వేదిక' అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియాతో వ్యాఖ్యానించింది. పేలవ ఫామ్‌లో ఉన్న వేద కృష్ణ మూర్తి ఇటీవల వరుస ప్రదర్శనలతో వరల్డ్‌కప్‌లో చోటు సాధించింది. 2018 వరల్డ్‌కప్ తర్వాత భారత్ ఆడిన 15 మ్యాచుల్లో 8 మాత్రమే గెలిచిం ది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా 8/11, ఇంగ్లాండ్ 9/13 విజయాలు సాధిం చాయి. వరల్డ్‌కప్ ఆశిస్తోన్న టీమ్ ఇండియా.. ముందుగా టైటిల్ ఫేవరెట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లను అధిగమిస్తే ట్రోఫీ అందుకోవటం లాంఛనమే!.
భారత టీ20 వరల్డ్‌కప్ జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్ కెప్టెన్), సఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగస్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, పూజ వస్ట్రాకర్, వేద కృష్ణమూర్తి, రాజేశ్వరి గైక్వాడ్, తానియా భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్, శిఖా పాండే, రాధ యాదవ్.