Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెరెనా, ఒసాకాలకు భంగపాటు
- అతికష్టంమీద గట్టెక్కిన ఫెదరర్
- ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల మోత మోగింది. 23 గ్రాండ్‌స్లామ్స్ విజేత సెరెనా విలియమ్స్‌కు వాంగ్ (చైనా) దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ నవొమి ఒసాక 15 ఏండ్ల అమెరికా సంచలనం కొకొ గాఫ్ చేతిలో భంగపడింది. మహిళల సింగిల్స్‌లో ఇద్దరు స్టార్స్ నిష్క్రమించగా.. దిగ్గజం రోజర్ ఫెదరర్ అతికష్టం మీద ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)
తొలి నాలుగు రోజులు సంచలనాలకు దూరంగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఐదో రోజు దిగ్గజాలకు దిమ్మదిరిగే షాకిచ్చింది. 23 గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్ మూడో రౌండ్లో భంగపడింది. చైనా అమ్మాయి, వరల్డ్ నం.27 క్వియాంగ్ వాంగ్ చేతిలో 4-6, 7-6(7-2), 5-7తో మూడు సెట్ల సమరంలో అనూహ్య ఓటమి చవిచూసింది. 15 ఏండ్ల అమెరికా సంచలనం కోకో గాఫ్ మరో మెరుపు విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ నవొమి ఒసాక (జపాన్)ను 6-3, 6-4తో వరుస సెట్లలో ఓడించింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది.
గట్టెక్కిన ఫెదరర్ : పురుషుల సింగిల్స్‌లో దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 100వ విజయాన్ని నమోదు చేశాడు. రికార్డు శతక విజయం స్విస్ యోధుడికి అంత సులువుగా లభించలేదు. ఆస్ట్రేలియా ఆటగాడు జాన్ మిల్‌మ్యాన్ చేతిలో దాదాపు ఓటమి చెందే ప్రమాదంలో పడిన ఫెదరర్ ఐదు సెట్ల మ్యాచ్‌లో కష్టంగా గట్టెక్కాడు. 4-6, 7-6(6-2), 6-4, 4-6, 7-6(10-8)తోత కంగారూ ఆటగాడిపై పైచేయి సాధించాడు. ఉత్కంఠగా సాగిన ఐదు సెట్ల మూడో రౌండ్లో టై బ్రేకర్‌లో వరుసగా ఆరు పాయింట్లు సాధించిన ఫెదరర్ మెల్బోర్న్లో ముందంజ వేశాడు. క్వార్టర్స్ బెర్త్ కోసం అన్‌సీడెడ్ మార్టన్ ఫసోవిక్స్తో ఫెదరర్ తలపడనున్నాడు. రెండో సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ వరుసగా మూడో రౌండ్లో అలవోక విజయం నమోదు చేశాడు. 6-3, 6-2, 6-2తో నిషియోక (జపాన్)పై విజయం సాధించాడు. గ్రీకు ఆటగాడు స్టెఫానిస్ సిట్సిపాస్‌పై 7-5, 6-4, 7-6(7-2)తో మిలోస్ రావోనిచ్ గెలుపొందాడు. మారిన్ సిలిచ్ 6-7(3-7), 6-4, 5-7, 6-3తో ఐదు సెట్ల మారథాన్ మ్యాచ్‌లో రాబర్ట్ బటిస్టా ఆగట్ (స్పెయిన్)పై పైచేయి సాధించాడు. ఫబియో ఫోగ్నిని 7-6(7-0), 6-2, 6-3తో పెల్లాపై అలవోక విజయం సాధించాడు.
గట్టి షాక్ : తొలి సెట్ కోల్పోయినా, తర్వాతి రెండు సెట్లలో తిరుగులేని విజయాలు సాధించటం సెరెనా విలియమ్స్ శైలి. మెల్బోర్న్లో సెరెనా నుంచి ఆ తరహా ప్రదర్శన కనిపించలేదు. వరల్డ్ నం.27 చేతిలో 4-6, 7-6(7-2), 5-7తో సెరెనా మట్టికరిచింది. ఒసాక 3-6, 4-6తో గాఫ్‌కు ప్రీ క్వార్టర్స్ బెర్త్ కోల్పోగా.. క్విటోవా 6-1, 6-2తో సులువుగా ముందంజ వేసింది. యాష్లె బార్టీ 6-3, 6-తో వరుస సెట్లలో విజయం సాధించింది.