Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో పురుషల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్, జకోవిచ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అర్జెంటీనాకు చెందిన స్కావర్ట్జ్మాన్పై 6-3, 6-4, 6-4 స్కోరుతో జకోవిచ్ విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో రోనిక్‌తో జకోవిచ్ తలపడనున్నాడు. ఆదివారం జరిగిన మరోక మ్యాచ్‌లో మారిన్ సిలిక్‌పై 6-4, 6-3, 7-5 స్కోరుతో విజయం సాధించిన రోనిక్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.
కాగా, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకొచ్చాడు. ఆదివారం నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఫుస్కోవిస్స్పై 4-6, 6-1, 6-2, 6-2 స్కోరుతో విజయం సాధించిన ఫెదరర్ క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్స్ ఫైనల్స్్కు చేరుకోవడం ఫెదరర్ కెరీర్లో ఇది 15వ సారి. ఈ టోర్నిలో ఇది ఒక రికార్డు. మొత్తంగా గ్ల్రాండ్ స్లామ్ టోర్నిలో క్వార్టర్స్‌కు చేరుకోవడం ఫెదరర్‌కు ఇది 57వ సారి. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆస్లే బార్టీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం నాలుగో రౌండ్ మ్యాచ్‌లో రిస్కేపై 6-3, 1-6, 6-4 స్కోరుతో బార్టీ విజయం సాధించింది.