Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోహ్నెన్స్బర్గ్ : స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ టెస్టులో ఆదివారం ఆటలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌటయింది. ఆదివారం ఆటలో ముందుగా 6 వికెట్ల నష్టానికి 86 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తన తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరికి 183 పరుగులకు ఆలౌటయింది. దక్షిణాఫ్రికా జట్టులో డికాక్ ఒక్కడే 76 పరుగులతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ రూట్ 58 పరుగులు చేశాడు. ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఒక టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ రెండు టెస్టుల్లో విజయం సాధించింది. ఈ చివరి నాలుగో టెస్టును ఇంగ్లండ్ డ్రా చేసుకున్నా సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.