- హైదరాబాద్, విదర్భ రంజీ మ్యాచ్ నవతెలంగాణ, హైదరాబాద్ : ఫయజ్ ఫజల్ (126 నాటౌట్, 209 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఖోల్కర్ (3), చౌదరి (4) విఫలమైనా గణేష్ సతీష్ (65, 153 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించిన ఫజల్ విదర్భను తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా నడిపించాడు. సిద్దేశ్ వాత్ (28) నిరాశపరిచినా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అక్షరు వాడ్కర్ (9)తో కలిసి ఫజల్ అజేయంగా ఆడుతున్నాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 242/4తో పటిష్ట స్థితిలో నిలిచింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌కు కేవలం 30 పరుగుల వెనుకంజలోనే నిలిచింది. ప్రతీక్ రెడ్డి (83), మెహిది హసన్ (30), మహ్మద్ సిరాజ్ (22) రాణించటంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ రవితేజ (2/19) రాణించాడు. మూడో రోజు ఆటలో తొలి సెషన్‌లోనే విదర్భ ఆధిక్యంపై కన్నేసింది.