Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్ విడుదల
సిడ్నీ: ఆస్ట్రేలియా సంచలనం ఆస్లీ బార్టీ మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోనే కొనసాగుతోంది. మంగళవారం అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(డబ్ల్యుటిఏ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బార్టీ ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లో ఓడినా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అన్‌సీడెడ్ సోఫియా(స్పెయిన్) ముగురుజాను ఓడించి టైటిల్‌ను చేజిక్కించుకోవడం ద్వారా ఒక్కసారిగా 7వ స్థానానికి ఎగబాకింది. రొమేనియాకు చెందిన మాజీ నవంబర్ వన్ సిమోనా హెలెప్(2), చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా ప్లిస్కోవా(3), స్విట్జర్లాండ్‌కు చెందిన బెలింద బెన్సిక్, కెనడాకు చెందిన ఆండ్రుస్కూ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక జపాన్‌కు చెందిన మాజీ నంబర్ వన్ నవోమీ ఒసాకా 10వ స్థానంలో నిలవగా... 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేత సెరెనా విలియమ్స్ 9వ స్థానంలో నిలిచింది.