Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ద్విశతకంపై బ్రాడ్ హాగ్
సిడ్నీ (ఆస్ట్రేలియా) : పరిమిత ఓవర్ల ఫార్మాట్ డబుల్ శతకాల మాస్టర్ రోహిత్ శర్మకే టీ20లో ద్వి శతకం బాదే సత్తా ఉందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ' ప్రస్తుతానికి రోహిత్ శర్మ ఒక్కడికే టీ20 ద్వి శతకం బాదే సత్తా, సామర్థ్యం ఉందని అనుకుంటున్నాను. మంచి స్ట్రయిక్‌రేట్, తిరుగులేని టైమింగ్, అన్ని క్రికెటింగ్ షాట్లు ఆడగల నైపుణ్యం, మైదానం నలుమూలలా సిక్సర్ బాదే సత్తా రోహిత్‌కు ఉన్నాయి' అన్ని బ్రాడ్ హాగ్ అన్నాడు. ట్విటర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బ్రాడ్ హాగ్ ఈ విధంగా బదులిచ్చాడు. రోహిత్ శర్మ 2007లో టీ20 అరంగ్రేటం చేశాడు. 94 టీ20ల్లో 2331 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 118. ఈ ఫార్మాట్లో క్రిస్ గేల్ 175, అరోన్ ఫించ్ 172లు ముందున్నారు. వన్డేల్లో రోహిత్ శర్మ 2014 శ్రీలంకతో వన్డేలో 264 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే.