Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: టీమిండియా మాజీ ఆటగాడు సంజరు బంగర్‌ను బంగ్లాదేశ్ క్రికెట్‌బోర్డు(బీసీబీ) టెస్ట్ బ్యాటింగ్ కోచ్ నియమించుకోనుంది. ఈమేరకు సంజయ్ బంగర్‌తో ఆ దేశ క్రికెట్ బోర్డు సంప్రదింపులు చేసింది. అయితే ఈ విషయమై బంగర్ స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదని తెలిసింది. 'మేము సంజయ్ బంగర్‌తో ఈ విషయమై చర్చించాము. ఒకవేళ బంగర్ రాలేని అవకాశం ఉంటే మిగతావాళ్లతో కూడా టచ్‌లో ఉంటాం' అని బీసీబీ ఎగ్జిక్యూటివ్ కోచ్ నిజాముద్దీన్ చౌదరి పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ తాను వన్డే, టీ20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని బీసీబీకి ఇటీవల తెలిపాడు. సంజరు బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఒకవేళ బంగర్ బంగ్లా జట్టుకు టెస్టు బ్యాటింగ్ కోచ్‌గా వస్తే మాత్రం జూన్2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు కొనసాగే అవకాశం ఉంది.