Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫుట్‌బాల్ క్లబ్లో విలువ 11,418 కోట్లు
-ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ స్టాటర్జీ.. సీఐఐఎస్ రిపోర్టు
లండన్: యూరప్‌లోనే అత్యంత విలువైన ఫుట్‌బాల్ జట్టుగా ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ లివర్ పుల్ కు దక్కింది. ఛాంపియన్స్‌లీగ్ లివర్‌పుల్ విలువ 1.4 బిలియన్ యూరోలు (సుమారు 11 వేల418 కోట్లు). ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ స్ట్రాటర్జీ..సీఐఐఎస్ రిపోర్టు ప్రకారం టాప్..10 విలువైన ఫుట్‌బాల్ క్లబ్లో ఐదు జట్లు ఇంగ్లాండ్‌కు చెందినవే. ప్రిమియర్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ మాంఛేస్టర్ సిటీ తొలి స్థానంలో ఉండగా..లివర్‌పుల్ రెండో స్థానంలో ఉన్నది. టాప్..10లో జర్మనీ లీగ్‌కు బుందేసలీగా కూడా ఈ క్లబ్లో చోటు దక్కలేదు. జర్మనీ క్లబ్ ఎస్సీ పెడరబోర్న్కు (98వ స్థానం) చివరి స్థానం దక్కింది. ఈ జట్టు విలువ 301 కోట్లు.
యూరప్‌లోని ఐదులీగ్ల అవకాశం
యూరప్‌లోని ఐదు మేజర్ లీగ్‌లు..అంటే ప్రిమియర్ లీగ్ (ఇంగ్లాండ్) లా లీగా (స్పెయిన్) బుందేసలీగా (జర్మనీ),సీరీ ఏ(ఇటలీ) లీగా..1(ఫ్రాన్స్) జట్లు ఉన్నాయి.
సీఐఐఎస్ రిపోర్టు ప్రకారం..ఆబ్జర్వేటరీ రీసెర్చి టీమ్ ఐదు మేజర్ యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన ఆటగాళ్ల ప్రతిభను విశ్లేషించింది. ఈ అధ్యయనంలో ప్రతి క్లబ్‌లోని టాప్..20 ఆటగాళ్ల విలువను పరిగణనలోకి తీసుకున్నది. ఆటగాళ్ల కాంట్రాక్ట్ విలువ, వయస్సు, ఏ క్లబ్ తరఫున ఆడుతున్నాడు.అతని ప్రతిభ, ఆటగాడి క్లబ్, ఆర్థిక విలువ ఇలా పలు కోణాల్లో వివరాలు సేకరించింది.