Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : కరోనా వైరస్ ప్రభావానికి వచ్చే ఏడాది జరగనున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను స్పెయిన్‌లో 2021 ఆగస్టులో జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన 2020 టోక్యో ఒలింపిక్స్‌ను 2021 ఆగస్టులో నిర్వహించడానికి షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2021 ఆగస్టులో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడానికి ఆవకాశం లేదు. కొత్త తేదీల కోసం నిర్వహకులతో స్పెయిన్‌లోని హ్యుల్వాలో చర్చలు జరుపుతున్నట్టు బ్యాడ్మింటెన్ ప్రపంచ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆదివారం వెల్లడించింది.