Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇన్స్టాగ్రామ్ లైవ్‌చాట్‌లో షేన్ వార్న్
న్యూఢిల్లీ : స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ తన వరల్డ్ ఎలెవన్ జట్టులో భారత స్టార్స్‌కు చోటు కల్పించాడు. షేన్ వార్న్ కెరీర్లో ఎదుర్కొన్న ప్రత్యర్థి జట్ల నుంచి వరల్డ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేన్ వార్న్ మంగళవారం అభిమానులతో లైవ్ సెషన్లో పాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా వరల్డ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. షేన్ వార్న్ ఆస్ట్రేలియాకు 194 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. 1999 వరల్డ్‌కప్‌లో ఆసీస్ విజయంలో ముఖ్య భూమిక వహించాడు. ఆ వరల్డ్‌కప్‌లో 20 వికెట్లు కూల్చిన వార్న్, ఫైనల్లో పాకిస్థాన్‌పై 4/33 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఓ వరల్డ్‌కప్ ఫైనల్లో స్పిన్నర్‌కు ఇదే ఉత్తమ ప్రదర్శన. ఐపీఎల్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, మెంటర్‌గా షేన్ వార్న్ 2008లో తొట్ట తొలి టైటిల్‌ను అందుకున్నాడు.
షేన్ వార్న్ వరల్డ్ ఎలెవన్ : వీరెందర్ సెహ్వాగ్, సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, కెవిన్ పీటర్సన్, కుమార సంగక్కర (వికెట్ కీపర్), అండ్రూ ఫ్లింటాఫ్, వసీం అక్రమ్, డానియల్ వెటోరి, షోయబ్ అక్తర్, కర్ట్లీ ఆంబ్రోస్.