Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం, పొగాకుపై సచిన్ టెండూల్కర్
కోచి: భారత క్రికెట్ దిగ్గజంగా సుమారు మూడు దశాబ్దాలు ప్రచారకర్తగా (యాడ్ అంబాసీడర్) వెలుగొందుతున్న సచిన్ టెండూల్కర్.. మద్యం, పొగాకు ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నట్లు తెలిపాడు. ' మా నాన్నగారు నాకు ఓ మాట చెప్పారు. ఎప్పుడూ మద్యం, పొగాకులకు ప్రచారకర్తగా వ్యవహరించకు అని. అందుకే ప్రచారకర్తగా దూరంగా ఉన్నది ఈ రెండింటికే' అని సచిన్ అన్నారు. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఇండియా చాప్టర్) సిల్వర్ జూబ్లీ సంబరాల సందర్బంగా ఏర్పాటు చేసిన మూడు రోజుల సదస్సు ముగింపుకు హాజరైన సచిన్ పలు విషయాలపై మాట్లాడాడు. యువత లక్ష్యం సాధించేవరకూ దేనిని మధ్యలో వదిలిపెట్టవద్దని, ఏదీ కష్టపడనిదే రాదని తెలిపారు.