Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : టెన్నిస్ జగత్తులో అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా క్రీడాకారిణిగా జపాన్ టెన్నిస్ సంచలనం నవోమి ఒసాకా నిలి చింది. దీంతో అమెరి కన్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఆమె వెనక్కినెట్టింది. గత పన్నెండు నెలల సంపా దన ఆధారంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన జాబితాలో రూ.284.20 కోట్లు(37.4 మిలియన్ డాలర్లు)తో ఒసాకా అగ్రస్థానంలో నిలిచింది. ఎండార్సుమెంట్లు, ప్రైజ్‌మనీ రూపంలో సెరెనా కంటే రూ.10.64 కోట్లు(1.4 మిలియన్ డాలర్లు) అధికంగా ఒసాకా సంపాదించింది. 22 ఏండ్ల ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందింది. దీంతో ఇప్పటివరకు రష్యా క్రీడాకారిణి షరపోవా పేరుతో ఉన్న రికార్డును ఆమె చెరిపివేశారు. షరపోవా 2015లో 29.7 మిలియన్ డాలర్లు సంపాదిం చింది. ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న 100మంది అథ్లెట్లతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది.