Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జాన్‌రైట్ కెప్టెన్‌కు స్వేచ్ఛనిచ్చాడు
లక్నో : జాన్ రైట్ (న్యూజిలాండ్), గ్రెగ్ చాపెల్ (ఆస్ట్రేలియా) ఈ ఇద్దరూ సౌరవ్ గంగూలీ భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చీఫ్ కోచ్‌లు పని చేశారు. ఒకరేమో జట్టును అత్యున్నత విజయానికి చేరువగా (2003 వరల్డ్‌కప్ ఫైనల్స్) తీసుకెళ్లగా.. మరొకరు జట్టులో గందరగోళ పరిస్థితికి కారణమయ్యాడు. చాపెల్ హయాంలో జట్టులో చోటు కోల్పోయిన గంగూలీ.. దేశవాళీ నిరూపించుకుని తిరిగి జాతీయ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దాదా తొలగింపుతో బెంగాల్లో అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం విదితమే. చాపెల్, జాన్‌రైట్ కోచింగ్ శైలిపై మహ్మద్ కైఫ్ తన అభిప్రాయం వెల్లడించాడు. ' చాపెల్ బ్యాటింగ్ కోచ్‌గా విజయవంతం అయ్యేవాడేమో. జట్టును సరైన దిశలో నడిపించన చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. భారత జట్టు కల్చర్‌ను అర్థం చేసుకోలేదు, మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవటంతో మంచి కోచ్‌గా నిలువలేకపోయాడు. జాన్‌రైట్‌ను అందరూ గౌరవించేవారు. జట్టులో అందరితో సమన్వయం చేసుకునేవాడు. కెప్టెన్‌గా ముందుండి నడిపించేందుకు గంగూలీకి స్వేచ్ఛనిచ్చాడు' అని కైఫ్ అన్నాడు.