Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత్, ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్ విడుదల
మెల్బోర్న్ : కరోనా సమయంలో ఊహించినట్టుగా క్రికెట్ ఆస్ట్రేలియా ఓ మెట్టు దిగింది. ఐదో టెస్టు కోసం ఆరాట చూపకుండా, పరిమిత ఓవర్ల ఫార్మాట్ వైపు మనసు మార్చుకుంది. ఈ ఏడాది ఆఖర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కోహ్లిసేన కంగారూ గడ్డపైకి వెళ్లకుంటే ఆస్ట్రేలియాకు సుమారు రూ.1900 కోట్ల నష్టం వాటిల్లనుంది. ఉమ్మడి ప్రయోజనాల నిమిత్తం ఆస్ట్రేలియా పర్యటనకు గ్రీన్ సిగల్ ఇచ్చిన బీసీసీఐ.. ఇరు దేశాల మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తోంది. బీసీసీఐ సమ్మతితో ఆస్ట్రేలియా గురువారం భారత్‌తో సిరీస్ షెడ్యూల్ విడుదల చేసింది. 4 టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లో కూడిన షెడ్యూల్ ఖరారు చేసింది. తాజా షెడ్యూల్లో అక్టోబర్-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా పట్టాలపైనే ఉందని సంకేతం ఇచ్చింది. టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ భవితవ్యంపై టీ20 సిరీస్‌ను అక్టోబర్‌లో నిర్వహించాలా లేదా జనవరిలో నిర్వహించాలా అనేది తేలనుంది. అక్టోబర్‌లో 11-17న జరిగే మూడు టీ20లకు బ్రిస్బేన్, కాన్బెర్రా, ఆడిలైడ్ ఆతిథ్యం వహించనున్నాయి. డిసెంబర్ 3-జనవరి 7 వరకు జరిగే బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌కు బ్రిస్బేన్, ఆడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీలు వేదిక కానున్నాయి. రెండో టెస్టు వేదిక ఆడిలైడ్‌లో డే నైట్ గులాబీ బంతి పోరు ఉండనుంది. జనవరి12-17న మూడు వన్డేలకు పెర్త్, మెల్బోర్న్, సిడ్నీలు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
సీఏపై వాకా చీఫ్ ఫైర్ : భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ క్రికెట్ ఆస్ట్రేలియాలో ముసలానికి కారణమైంది. వెస్టర్న్ ఆస్ట్రేలియన్స్ క్రికెట్ అసోసి యేషన్(వాకా) ఇటీవలే అధునాతన ఆప్టన్ స్టేడియాన్ని నిర్మించింది. 2014 భారత జట్టు పర్యటన సందర్భంగా వాకాలో టెస్టు మ్యాచ్ చోటుచేసుకోలేదు. స్టేడియం నాణ్యత ప్రమాణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. నూతన స్టేడియం నిర్మాణం అనంతరం మెగా జట్లతో టెస్టు సిరీస్‌కు ఆతిథ్యం కల్పించే అవకాశం ఇస్తామని సీఏ పెద్దలు హామీ ఇచ్చారు. ప్రపంచ అగ్రశ్రేణి టెస్టు జట్టు, ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లిసేన ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు టెస్టు మ్యాచ్ ఆతిథ్య అవకాశం దక్కకపోవటంపై వాకా చీఫ్ క్రిస్టినా మాథ్యూస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ' గత రెండేండ్లుగా క్రికెట్ కొలమానాల్లో ఏ రకంగా చూసినా బిస్బేన్ గబ్బాను పెర్త్ వాకా దాటేసింది. అభిమానుల హాజరు, ప్రసారదారుల రేటింగ్, ఏడాదిలో కురిసే వర్షపాతం శాతం, అందుబాటులోని కార్పోరేట్ సీట్లు, సరికొత్త స్టేడియం ఇలా ఎన్నో విధాలుగా వాకా ముందంజలో ఉంది. 2014 పర్యటనలో వాకా స్టేడియా బాగాలేదని మ్యాచ్ కేటాయించలేదు. కొత్త స్టేడియంలో అగ్ర జట్ల మ్యాచులకు సహకారం ఉంటుందని చెప్పారు. మరోసారి అదే అన్యాయం చేశారు' అని క్రిస్టినా విమర్శలు గుప్పించింది.